విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఒప్పంద కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. 24 గంటల సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో శుక్రవారం ఉ.6 గంటలకు విధులకు హాజరైనా పని చేయకుండా నిరసన తెలుపుతున్నారు. ఒక్కరోజు సమ్మెలో భాగంగా రేపటి వరకు కార్మికులు సమ్మె చేయనున్నారు. అక్రమంగా తొలగించిన వారందరినీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాత్రి వరకు యాజమాన్యంతో చర్చలు జరిపారు. విఫలం కావడంతో జంగ్ సైరన్ మోగించారు.
![]() |
![]() |