2025 IPL భాగంగా నిన్న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ మరియూ లక్నో సూపర్ జాయింట్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో SRH అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ, జట్టు వాటిని అందుకోలేక నిరాశపరిచింది. ముందు టాస్ గెలిచిన లక్నో బౌలింగ్ ఎంచుకుంది. కాగా మొదటి బాటింగ్ కి దిగిన హైదరాబాద్ అభిషేక్ శర్మ 6, ఇషాన్ కిషన్ (గోల్డెన్ డక్) త్వరగా ఔట్ అయ్యాడు. హెన్రిచ్ క్లాసెన్ (14), నితీష్ కుమార్ రెడ్డి (32)లు కొంత ప్రతిఘటన చూపినప్పటికీ, లక్నో బౌలర్లు, ముఖ్యంగా షార్దూల్ ఠాకూర్ (4/34), వారిని కట్టడి చేశారు. చివర్లో అనికేత్ వర్మ (36, 13 బంతుల్లో) వేగంగా ఆడి స్కోరును 190కి చేర్చాడు.
191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్, నికోలస్ పూరన్ (70, 26 బంతుల్లో), మిచెల్ మార్ష్ (52, 31 బంతుల్లో)ల విధ్వంసకర బ్యాటింగ్‌తో కేవలం 16.1 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. పూరన్ 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 269.23 స్ట్రైక్ రేట్‌తో ఆడగా, మార్ష్ కూడా సమర్థవంతంగా రాణించాడు. చివర్లో అబ్దుల్ సమద్ (22, 8 బంతుల్లో) కూడా కీలక పాత్ర పోషించాడు. SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 3 వికెట్లు తీసినప్పటికీ, లక్నోను ఆపలేకపోయాడు. మహ్మద్ షమీ, ఆడమ్ జంపా తలా ఒక వికెట్ పడగొట్టారు.
![]() |
![]() |