విమానంలో ప్రయాణిస్తున్న ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. పక్కనే ఇద్దరు మహిళలు కూర్చుని ఉండగా.. వారి వైపు కోరికగా చూస్తూ విమానం గాల్లో ఉండగానే హస్త ప్రయోగం చేసుకున్నాడు. దీంతో తెగ ఇబ్బంది పడిపోయిన మహిళలు.. సీటు మార్చమంటూ సిబ్బంది వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని వెల్లడించారు. దీంతో సిబ్బంది వచ్చి సదరు ప్రయాణికుడిని హెచ్చరించారు. కానీ అతడు మాత్రం వారు చెప్పేది వినకుండా అలాగే పిచ్చిగా ప్రవర్తించాడు. ఇక చేసేదేమీ లేక విమానం దిగిన వెంటనే సదరు ప్రయాణికుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నుంచి జర్మనీలోని డ్రెస్డెన్‌కు వెళ్తున్న స్విస్ ఎయిర్ ఎల్ఎక్స్918 విమానంలోనే ఈ అసభ్యకరమైన ఘటన జరిగింది. ముఖ్యంగా విమానం ఉదయం 6.45 గంటలకు జ్యూరిచ్ నుంచి టేకాఫ్ అయి గాల్లో ఎగురుతోంది. అయితే జర్మనీకి చెందిన 33 ఏళ్ల ప్రయాణికుడి పక్క సీట్లలో మరో ఇద్దరు మహిళలు కూర్చున్నారు. 7.40 గంటల సమయంలో సదరు ప్రయాణికుడు వారిని చూడగా.. అతడికి కామ వాంఛ కల్గింది. దీంతో ఆయన తన ప్యాంటు జేబులో చేతు పెట్టుకుని హస్త ప్రయోగం చేసుకున్నాడు.
హస్తప్రయోగం ఆపమంటూ సిబ్బంది హెచ్చరికలు..
అలాగే పక్కనే ఉన్న మహిళలను పదే పదే చూస్తుండగా.. విషయం గుర్తించిన మహిళలు ఆ అసభ్యకర పని చూసి తీవ్ర కోపోద్రేకానికి గురయ్యారు. వెంటనే సిబ్బంది వద్దకు వెళ్లి తమ సీట్లు మార్చాలని.. పక్కనున్న ప్రయాణికుడు హస్త ప్రయోగం చేసుకుంటున్నాడని వివరించారు. దీంతో సిబ్బంది వచ్చి సదరు ప్రయాణికుడిని హస్త ప్రయోగం ఆపాలని హెచ్చరించారు. కానీ అతడు మాత్రం వారి మాట వినకుండా తన పని తాను చేసుకున్నాడు. దీంతో మహిళా ప్రయాణికుల సీట్లు మార్చిన సిబ్బంది.. విమానం జర్మనీకి చేరిన వెంటనే వ్యక్తిని పోలీసులకు అప్పగించారు.
జననాంగాన్ని బయట పెట్టలేదు కాబట్టి కేసు పెట్టొద్దు..!
ఈక్రమంలోనే పోలీసులు సదరు ప్రయాణికుడిని ప్రశ్నించగా.. ఇద్దరు మహిళలను చూస్తే తనకు కోరికి కల్గిందని.. అందుకే హస్త ప్రయోగం చేసుకున్నట్లు చెప్పాడు. తన తప్పున ఒప్పుకుంటూనే తనపై కేసు పెట్టడానికి వీళ్లేదని వాదించాడు. తానేమీ అందరికీ కనిపించేలాగా బట్టలు విప్పి అలా చేయలేదని.. జేబులో చేయి పెట్టుకుని మాత్రమే చేసినట్లు వివరించాడు. కానీ పోలీసులు మాత్రం అతడికి షాక్ ఇస్తూ.. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కల్గించినందుకు గాను అరెస్ట్ చేశామంటూ వివరించారు.
![]() |
![]() |