విశాఖ నగరంలో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మర్రిపాలెం ప్రాంతానికి చెందిన యువకుడు, సింహాచలం ప్రాంతానికి చెందిన ఓ యువతి గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శుక్రవారం తమ స్నేహితుడి ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
![]() |
![]() |