రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు మరో 9 మందిపై అక్రమ కేసు నమోదు చేసిందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. నిన్న తిరుపతి రూరల్ ఎంపీపీ స్థానాన్ని వైయస్ఆర్‌సీపీ కైవసం చేసుకోంది. ఈ క్రమంలో వైయస్ఆర్‌సీపీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. వైయస్ఆర్‌సీపీ విజయాన్ని జీర్ణించుకోలేని అధికార పార్టీ నేతలు పోలీసులపై ఒత్తిడి చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన అంటూ యూనివర్సిటీ ఎస్. ఐ కృష్ణయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
![]() |
![]() |