రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులపై విద్య భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమలు చేయనుంది. దీనికోసం రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ 'నో బ్యాగ్ డే' అనే వినూత్న కార్యక్రమాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. బడి అంటే బరువైన పుస్తకాలతో నిండిన బ్యాగులు, పరీక్షల భయం అనే ముద్రను చెరిపేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని విద్యార్థులకు చదువును మరింత ఆనందదాయకంగా మార్చేందుకు, నైపుణ్యాలను వెలికితీసేందుకు 'నో బ్యాగ్ డే' కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ప్రతి శనివారం 'నో బ్యాగ్ డే' నిర్వహించనున్నారు.పుస్తకాల భారం తగ్గించి ఆటపాటలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. 'నో బ్యాగ్ డే' రోజున విద్యార్థులకు సాంప్రదాయ తరగతులకు బదులుగా అనేక రకాల వినోదాత్మక, విద్యా సంబంధిత కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీని ద్వారా విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసే ప్రయత్నం చేస్తారు.
![]() |
![]() |