విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తిని పెంచేందుకే 'నో బ్యాగ్ డే' కార్యక్రమం రూపొందించామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అయన మాట్లాడుతూ.... ఇది విద్యార్థులకు ఒక వినూత్న అనుభూతిని అందిస్తుంది. నైపుణ్యాధారిత విద్యకు ప్రాధాన్యత ఇవ్వడమే మా లక్ష్యం. 'నో బ్యాగ్ డే' అనేది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, ఇది విద్యావ్యవస్థలో ఒక నూతన శకానికి నాంది పలుకుతుంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు మరింత ఉత్సాహంగా, సంతోషంగా విద్యను అభ్యసిస్తారని ఆశిద్దాం" అని అన్నారు.ఈ కార్యక్రమం ద్వారా ... విద్యార్థుల జ్ఞానాన్ని పరీక్షించేందుకు, వారిలో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు క్విజ్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విద్యార్థులకు వివిధ వృత్తులపై అవగాహన కల్పించి, ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ ఇస్తారు. సమకాలీన అంశాలపై నిపుణులతో సెమినార్లు నిర్వహించి, విద్యార్థుల్లో విశ్లేషణాత్మక ఆలోచనలను ప్రోత్సహిస్తారు. విద్యార్థుల్లో శారీరక ధారుడ్యాన్ని పెంపొందించేందుకు వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తారు. డ్రాయింగ్, పెయింటింగ్, సంగీతం, నృత్యం వంటి లలిత కళల్లో విద్యార్థుల నైపుణ్యాలను వెలికితీస్తారు. విద్యార్థులకు రాజకీయ వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు మాక్ పార్లమెంట్ నిర్వహిస్తారు.
![]() |
![]() |