మరోసారి కాల్పుల మోతతో ఛత్తీస్గఢ్ ఉలిక్కిపడింది. సుక్మా జిల్లాలో పోలీసులకు, మావోయిష్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటలనలో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు.ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. సుక్మా-దంతేవాడ సరిహద్దులో ఉప్పనల్లి వద్ద గోగుండ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ప్రతిగా జరిపిన కాల్పుల్లో మావోయిస్టులకు భారీగా నష్టం వాటిల్లింది. ఘటనా స్థలం నుంచి ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనపర్చుకున్నారు.ఘనటలో ఇద్దరు జవాన్లకు గాయాలైనట్లు అధికారులు ప్రకటించారు. అయితే కాల్పుల్లో మావోయిస్టు కమాండర్ డీవీసీఎం జగదీష్ మృతి చెందాడని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. అధికారికంగా ధృవీకరణ కావాల్సి ఉంది. ప్రస్తుతం అక్కడ ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ పర్యవేక్షణలో డీఆర్జీ, సీఆర్పీఎఫ్ జవాన్లు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. మావోయిస్టు రహిత భారత్ లక్ష్యంగా ఆపరేషన్ కగార్ పేరిట హోం మంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. గత మూడు నెలల్లో జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో 100 మంది దాకా మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టడం గమనార్హం.
![]() |
![]() |