అనంతపురం ఎస్పీ జగదీష్‌ను శనివారం వైయస్ఆర్ సీపీ నేతల బృందం కలిసింది. తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇటీవల తాడిపత్రి లో మైనారిటీ నేత, వైయస్ఆర్‌సీపీ కౌన్సిలర్ ఫయాజ్ బాషా ఇంటిపై జేసీ వర్గీయుల దాడిని ఎస్పీ దృష్టి కి తీసుకెళ్లారు. బాధితుడు ఫయాజ్ బాషా ను తాడిపత్రి కి వెళ్లకుండా ఆంక్షలు విధించటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంజాన్ పండుగ సమయంలో తాడిపత్రిలోని ఆయన ఇంటిలో ఉండనివ్వకుండా రెండు రోజుల క్రితం ఫయాజ్ బాషను పోలీసులు అనంతపురానికి తరలించారని ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. ఫయాజ్ కుటుంబానికి రక్షణ కల్పించాలని, తాడిపత్రిలో శాంతిభద్రతలు నెలకొల్పాలని, జేసీ ప్రభాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ నేతలు కోరారు. ఎస్పీ ని కలిసిన వారిలో వైయస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్సీ ఇసాక్, మాజీ ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్, అనంతపురం మేయర్ మహమ్మద్ వాసీం, హజ్ కమిటీ మాజీ చైర్మన్ గౌసుల్ అజమ్, మైనార్టీ విభాగం నాయకులు పాల్గొన్నారు.
![]() |
![]() |