తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అంశం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కొలికపూడి అల్టిమేటం జారీ చేసిన 48 గంటలు డెడ్‌లైన్ పూర్తికావొస్తోంది. దీంతో ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ టీడీపీ వర్గాల్లో నెలకొంది. 48 గంటల్లో రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కొలికిపూడి వ్యాఖ్యలు చేయడం.. అంతే కాకుండా రమేష్ రెడ్డితో పాటు గిరిజన మహిళలు.. కొలికపూడిపై వ్యాఖ్యలు చేయడం తీవ్ర సంచలనానికి దారి తీసింది. నేటితో కొలికొపూడి విధించి 48 గంటల డెడ్‌లైన్ ముగియనుండటంతో ఏం జరుగుతుంది అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇదిలా ఉండగా.. తిరువూరు అంశం అధిష్టానం దృష్టికి వచ్చింది. దీంతో దీనిపై ఒక నివేదిక తయారు చేసి ఇవ్వాలని నెట్టు రఘురాం, ఎంపీ కేశినేని చిన్ని, మాజీ ఎమ్మెల్సీ రాజులను పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఈ క్రమంలో వారంతా కూడా తిరువూరులో స్థానిక టీడీపీ నేతల నుంచి వివరాలు సేకరించి ఓ నివేదికను రూపొందించి పార్టీ అధిష్టానానికి పంపినట్లు తెలుస్తోంది. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు లేదా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీసుకునే అవకాశం ఉంది.
![]() |
![]() |