పేదలు, కార్మికులు, ప్రజలు, రాజకీయ అనిశ్చితిని దృష్టిలో పెట్టుకుని రాజకీయ చైతన్యం కోసం అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ అన్నారు. టీడీపీ ఆవిర్భావన దినోత్సవం సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. ‘ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం’ అనే నినాదంతో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఏర్పడిన పార్టీ తెలుగుదేశం అని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అనేక సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేసిన పార్టీ అని తెలిపారు. సామాజిక న్యాయాన్ని పాటిస్తూ అన్ని వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించే పార్టీ టీడీపీ అని అన్నారు. 40 ఏళ్లుగా అన్న ఎన్టీఆర్ ఆశయాలను భుజస్కంధాలపై మోస్తూ పార్టీని అభివృద్ధి చేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. వెనుకబడిన వర్గాలు, ముఖ్యంగా మహిళలు, యువతకు అండగా నిలిచే పార్టీ తెలుగుదేశమన్నారు. ‘నా ప్రాణం ఉన్నంత వరకు ఎన్టీఆర్ ఆశయాల సాధనకు చంద్రబాబు అడుగుజాడలోనే నడుస్తానని పల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు.
![]() |
![]() |