ఈసారి మహానాడును కడపలో నిర్వహించబోతున్నాం అని సీఎం చంద్రబాబు అన్నారు. అయన మాట్లాడుతూ.... పేదలకు అండగా నిలవాలని ఎన్టీఆర్ ఎప్పుడూ అంటుండేవారు. ఆ ఆశయ సాధనలో భాగంగానే పీ4 కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఆర్థికంగా బాగున్నవారు అట్టడుగున ఉన్నవారికి సహకారం అందించి పైకి తీసుకురావడం. కోటి సభ్యత్వాలు అనేది అసాధారణ రికార్డ్. పార్టీ సభ్యత్వం ద్వారా రూ.5 లక్షల ప్రమాద బీమా ద్వారా కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలుస్తున్నాం. కార్యకర్తలకు ఆవిర్భావ శుభాకాకంక్షలు తెలపడమే కాదు.. వారికి జన్మంతా రుణపడి ఉంటాను. పార్టీ కుటుంబ పెద్దగా అండగా ఉంటా. కార్యకర్తలే టీడీపీకి శ్రీరామరక్ష. తెలుగుదేశం బలోపేతం అవ్వడం అంటే రాష్ట్రానికి మంచి జరగడమే" అని చంద్రబాబు అన్నారు.
![]() |
![]() |