కృష్ణా జిల్లా పరిధిలోని ఆత్కూరు భూకబ్జా కేసులో వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ఒకరోజు కస్టడీకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి వంశీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాగా, గన్నవరం కోర్టు శుక్రవారం నాడు వంశీని ఒకరోజు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఆత్కూరు పీఎస్ పరిధిలో ఓ భూ వివాదానికి సంబంధించి శ్రీధర్‌రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఉంగుటూరు పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. ఇక గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వంశీ ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
![]() |
![]() |