తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తొలిసారిగా కుప్పంలో జరిగిన రంజాన్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. రంజాన్ మాసం ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైనదని, ఈ విందులో పాల్గొనడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని ఆమె అన్నారు.ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ, ఇది తన మొదటి ఇఫ్తార్ విందు అని, గుడికి వెళ్లినపుడు కలిగే పవిత్ర భావన లాగానే ఉందని తెలిపారు. ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు వింటుంటే ఒక విధమైన ఆధ్యాత్మిక అనుభూతి కలిగిందని ఆమె పేర్కొన్నారు. కుప్పంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం మరింత సంతోషంగా ఉందని, అల్లాహ్ అందరినీ చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నానని ఆమె అన్నారు. గత ప్రభుత్వాలు ముస్లింల కోసం చేసిన కార్యక్రమాలను కొనసాగిస్తారా అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, కూటమి ప్రభుత్వం అన్ని కులాల, మతాల ప్రజల సంక్షేమానికి పాటుపడుతుందని భువనేశ్వరి స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరి నమ్మకాలను గౌరవించి, అందరూ సంతోషంగా ఉండేలా చూస్తామని ఆమె భరోసా ఇచ్చారు. అన్ని మతాల సంప్రదాయాలను గౌరవిస్తూ, పథకాలను అమలు చేస్తామని ఆమె తెలియజేశారు.
![]() |
![]() |