‘నా పోటీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల నారా లోకేష్. మన ఇల్లు - మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా నీరుకొండ గ్రామానికి చెందిన 99 మందికి, రత్నాల చెరువుకు చెందిన 199 మందికి శాశ్వత ఇంటి పట్టాలను మంత్రి లోకేష్ పంపిణీ చేవారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రతీ విషయంలో చంద్రబాబుతో పోటీపడేందుకు ప్రయత్నిస్తానన్నారు. కుప్పం కంటే ఒక్క ఓటైనా ఎక్కువ వస్తుందని చంద్రబాబుతో చేసిన ఛాలెంజ్ నిలబెట్టుకున్నానని హర్షం వ్యక్తం చేశారు. మంగళగిరి ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించే బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు.మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని పనిచేస్తానన్నారు. మంగళగిరిలో రానున్న రోజుల్లో కరెంట్ తీగలు కనిపంచవని చెప్పుకొచ్చారు. భూగర్భ విద్యుత్‌తో పాటు, భూగర్భ డ్రైనేజ్, భూగర్భ గ్యాస్ వ్యవస్థను తీసుకొస్తామన్నారు. స్వచ్ఛ భారత్‌లో మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. స్వచ్ఛ మంగళగిరి కోసం ప్రజలందరి సహకారం అవసరమన్నారు. ఎవరూ ఇళ్ల ముందు చెత్త వేయొద్దన్నారు. ఎవరైనా ఇంటి ముందు చెత్త వేస్తే వారితో కలిసి తానూ ఆ చెత్త ఎత్తుతానని చెప్పారు. బహిరంగ మార్కెట్‌లో రూ.వెయ్యి కోట్ల విలువైన ఆస్తిపై శాశ్వత హక్కు మంగళగిరి ప్రజలకు కల్పిస్తున్నామన్నారు.
![]() |
![]() |