ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సొంత నగరం క్రైవీ రిపిపై రష్యా దాడి జరిపింది. ఈ దాడిలో 9 మంది చిన్నారుల సహా 18 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
దాడి సమయంలో నివాస ప్రాంతంలో ఉన్న చిన్నారుల ఆట స్థలంపై రష్యా మిసైల్ దాడి చేయడంతో 20 మందికి పైగా గాయాలయ్యాయి.. ఈ దాడి ఘటనపై స్పందించిన జెలెన్‌స్కీ.. "ఎక్కడ దాడి చేస్తున్నామనే విషయం తెలిసే రష్యా ఈ దురాగతానికి పాల్పడింది" అని వ్యాఖ్యానించారు.
![]() |
![]() |