ఏప్రిల్ 6న జరుగు బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పండగల జరుపుకోవాలని ఆ పార్టీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కొండిశెట్టి వెంకటరమణయ్య శనివారం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
1980 ఏప్రిల్ 6వ తేదీన బీజేపీ ఆవిర్భవించిందన్నారు. ప్రతి బూత్ కమిటీ, గ్రామ, మండల స్థాయిలో బీజేపీ జెండాను ఆవిష్కరించి పండగలా జరపాలన్నారు. ప్రతి కార్యకర్త ఇంటిపై బీజేపీ జెండాను ఎగురవేయాలన్నారు.
![]() |
![]() |