మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఆయన ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బస్తర్ గిరిజనుల అభివృద్ధిని మావోయిస్టులు ఆపలేరని అన్నారు. 2026 మార్చి నాటికి నక్సల్ సమస్య అంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. బస్తర్‌లో బుల్లెట్ కాల్పులు, బాంబు పేలుళ్ల రోజులు ముగిశాయని ఆయన అన్నారు. ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులు మనలో భాగమేనని, ఏ మావోయిస్టు చనిపోయినా ఎవరిలోనూ సంతోషం ఉండదని అన్నారు. ఆయుధాలను చేతబూని స్థానికుల, గిరిజనుల అభివృద్ధిని అడ్డుకోలేరని అన్నారు.
![]() |
![]() |