సమాజానికి ఏదైనా మంచి చేసినప్పుడు తృప్తి కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుర్తింపు, గౌరవం కావాలని కొందరు అనుకుంటుంటారు... డబ్బుతో ఎప్పుడూ గౌరవం రాదు... సమాజానికి మంచిపని చేస్తేనే గౌరవం, గుర్తింపు లభిస్తుంది... అని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం ముగిసిన అనంతరం చంద్రబాబు మార్గదర్శి-బంగారు కుటుంబం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ గ్రామంలో 41 పేద కుటుంబాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రజా వేదిక సభలో బంగారు కుటుంబ సభ్యుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మార్గదర్శి గోగినేని రవిచంద్రను సన్మానించారు. అనంతరం సీఎం మాట్లాడారు.
![]() |
![]() |