రాజధాని అమరావతి నిర్మాణం కోసం తాజాగా పిలిచిన టెండర్లలో భారీ దోపిడీకి కూటమి ప్రభుత్వం సిద్దమైందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పైకి రాజధాని అభివృద్ది మంత్రంను జపిస్తున్నా, దీని వెనుక పెద్ద ఎత్తున అవినీతి కుతంత్రం దాగి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెబుతూనే వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి, దానిలోంచి కమీషన్ల రూపంలో జేబులు నింపుకునేందుకు చంద్రబాబు స్కెచ్ వేశారని ఆరోపించారు. సొమ్ము చంద్రబాబు జేబుల్లోకి, తెచ్చిన అప్పుల భారం ప్రజల నెత్తిన రుద్దే దుర్మార్గమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ధ్వజమెత్తారు.
![]() |
![]() |