పాలకొండ నియోజకవర్గంలో నాలుగుమండలాల్లో వివిధ గ్రామాలలో ఆదివారం శ్రీ రామనవమి పర్వదిన సందర్భంగా స్థానిక రామ మందిరాలలో తెల్లవారుజాము నుంచి స్వామివారికి పూజలు ప్రారంభమయ్యాయి. స్వామివారికి అష్టోత్తరాలతో, అభిషేకాలు, ప్రత్యేక పూజలను అర్చకులు భక్తులతో చేయించారు. సీతారాముల ఉత్సవ విగ్రహాలకు కళ్యాణం నిర్వహించారు. మధ్యహ్నం గ్రామంలో అన్న సమారాధన ఉంటుందని కమిటీ అన్నారు.
![]() |
![]() |