ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల మోత మోగించిన విషయం విదితమే. ఈ తరుణంలో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సుంకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.ఇటలీ లీగ్ నాయకుడు మాటియో సాల్వినితో ముఖాముఖిలో ఎలాన్ మస్క్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో యూఎస్ – యూరప్ దేశాల మధ్య సుంకాలు లేకుండా చూడాలని తాను కోరుకుంటున్నానన్నారు.భవిష్యత్తులో అమెరికా – యూరప్ దేశాల మధ్య మరింత సన్నిహితమైన, బలమైన భాగస్వామ్యం ఏర్పడుతుందని, తద్వారా ఇరు దేశాల మధ్య ఎలాంటి సుంకాలు ఉండవని ఆశిస్తున్నానని మస్క్ పేర్కొన్నారు. ఇటలీతో సహా ఇతర యూరప్ దేశాలకు 20 శాతం సుంకాలు విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
![]() |
![]() |