మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ బీజేపీ నాయకుడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బైరంగడ్ గ్రామానికి చెందిన మైనర్ బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డ ములుగు జిల్లా వెంకటాపురం మండల బీజేపీ అధ్యక్షుడు రామెల్ల శేఖర్. మిరపకాయల కోయడానికి కూలి పని కోసం కుటుంబ సభ్యులతో కలిసి వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామానికి వచ్చిన మైనర్ బాలిక. నిత్యావసర సరుకుల కోసం బెస్తగూడెం గ్రామానికి వెళ్తున్న బాలికను మార్గ మధ్యలో కాపుకాసి, బండిపై ఎక్కించుకొని బలవంతంగా అడవి ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డ బీజేపీ నాయకుడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీజేపీ నాయకుడిపై పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన వెంకటాపురం పోలీసులు
![]() |
![]() |