దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన ‘పాంబన్ బ్రిడ్జి’ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. భారత భూభాగాన్ని రామేశ్వరంతో కలుపుతూ నిర్మించిన ఈ వంతెనను మోదీ జాతికి అంకితం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, రూ. 535 కోట్లు వెచ్చించి తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఈ వంతెనను నిర్మించారు. 2020లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆర్‌వీఎన్‌ఎల్ పనులు చేపట్టి, నాలుగేళ్లలో పూర్తిచేసింది. సముద్రంలో 2.08 కి.మీ. పొడవున్న ఈ వంతెనపై రైళ్ల రాకపోకలు సాగించేలా, కింది నుంచి ఓడలు వెళ్లేందుకు వీలుగా వర్టికల్ లిఫ్ట్ ఉంటుంది. 2019 మార్చి 1న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. మోదీ పచ్చజెండా ఊపగానే ఈ బ్రిడ్జి పైనుంచి రామేశ్వరం-తాంబరం స్పెషల్ ట్రైన్ పరుగులు తీసింది.
![]() |
![]() |