పల్లెల సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఎద్దుల పందాలు అని మంత్రి సవిత పేర్కొన్నారు. ఆదివారం గోరంట్ల పట్టణంలోని మరువ ఆంజనేయస్వామి దేవాలయం వద్ద టీడీపీ నాయకులు నిమ్మల శ్రీధర్ ఆధ్వర్యంలో రాతి దూలం లాగుడు పోటీలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సవిత హాజరయ్యారు. ఆంజనేయస్వామి దేవాలయంలో మంత్రి పూజలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
![]() |
![]() |