భార్యపై అనుమానం పెంచుకొని చంపేయగా ఏడాది తర్వాత నిజం బయటపడింది. యూపీలోని బిజ్నోర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆసిఫా, కమీల్ భార్యాభర్తలు. భార్యపై అనుమానం పెంచుకున్న కమీల్ సోదరుడి సాయంతో 2023లో ఆమెను చంపేసి ఇంటి సమీపంలో పాతిపెట్టారు.
అయితే ఏడాదిగా తమ కుమార్తెతో మాట్లాడనీయకపోవడంతో కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో నిజం బయటపడడంతో నిందితులని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
![]() |
![]() |