శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 11న జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం కోసం ఒంటిమిట్ట ఆలయంలో ఆదివారం తలంబ్రాల తయారీ శాస్త్రోక్తంగా ప్రారంభమైంది.
ఎంతో ప్రాముఖ్యత ఉన్న ముత్యాల తలంబ్రాల ప్యాకింగ్ కార్యక్రమం శ్రీవారి సేవకులతో టీటీడీ ప్రారంభించింది. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా కల్యాణ వేదిక గల పీసీసీ వద్దకు తీసుకొచ్చారు. దాదాపు 425 మంది శ్రీవారి సేవకులు లక్షకు పైగా తలంబ్రాల ప్యాకెట్ల తయారీలో పాల్గొంటున్నారు.
![]() |
![]() |