అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త పన్నుల విధానాన్ని ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లు కుప్పకూలాయి. అపర కుబేరులు మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ ఒక్కరోజులోనే భారీగా నష్టపోయారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ సంపద ఒక్కరోజులో 17.9 బిలియన్ డాలర్లు (రూ.1.5 లక్షల కోట్లు) తగ్గింది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 16 బిలియన్ డాలర్లు (రూ.1.3 లక్షల కోట్లు), టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ 8.7 బిలియన్ డాలర్ల (రూ.74 వేల కోట్లు) నష్టాన్ని చవిచూశారు.ట్రంప్ ప్రభుత్వం వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలు విధించడంతో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే మొదట అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఇదే అతిపెద్ద ఆర్థిక పతనం అని నిపుణులు చెబుతున్నారు. పన్నుల ప్రభావం వల్ల వ్యాపార వ్యయాలు పెరగడం, ప్రపంచ వాణిజ్యం మందగించడం, సాంకేతిక రంగం పనితీరు దిగజారడం వంటి కారణాల వల్ల ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు.
![]() |
![]() |