కోనసీమ జిల్లా అయినవిల్లి జనసేనలో విభేదాలు భగ్గుమన్నాయి. జనసేన నేత తొలేటి ఉమపై నిన్న అయినవిల్లి మండల అధ్యక్షుడు పొలిశెట్టి రాజేశ్ దాడి చేశారు. అర్ధరాత్రి తొలేటి ఉమ ఇంట్లోకి రాజేశ్, అతని అనుచరులు చొరబడి దాడి చేశారు. ఈ దాడిలో ఉమ, అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి జనసేన మండల అధ్యక్షుడు పొలిశెట్టి రాజేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.అయితే, మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్ కారును ధ్వంసం చేశారు ఉమ అనుచరులు.. ఈ దాడిలో ఉమ అనుచరులు కొంతమంది గాయాలపాలయ్యారు.. ఈ ఘటన పోలీసుల స్టేషన్ వరకు చేరడం.. రంగంలోకి దిగిన పోలీసుల.. జనసేన మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.. రాజేష్ వాహనం ధ్వంసం ఘటనలో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. కాగా, నిన్న మధ్యాహ్నం పి.గన్నవరం పార్టీ ఆఫీసులో జరిగిన మండలం స్థాయి సమావేశంలో ఇద్దరి మధ్య జరిగిన ఒక వాగ్వాదం.. చివరకు దాడికి దారితీసినట్టుగా తెలుస్తోంది..
![]() |
![]() |