ఉత్తరాఖండ్‌కు చెందిన షబీర్ అనే యువకుడికి యూపీలోని బిజ్నోర్ జిల్లాకు చెందిన యువతితో శనివారం నాడు పెళ్లైంది. పెళ్లి తర్వాత ఆచారాల ప్రకారం వధువు కుటుంబ సభ్యులు వరుడి చెప్పులు దాచారు.
తిరిగి ఇవ్వాలంటే రూ.50 వేలు డిమాండ్ చేశారు. వరుడు రూ.5 వేలు ఇచ్చి అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో ఇరువైపుల బంధువులకు ఘర్షణలు జరిగాయి. ఈ క్రమంలో వరుడిని ఓ గదిలో బంధించి వధువు తరఫు బంధువులు కర్రలతో కొట్టారు. చివరకు పోలీసులు రావడంతో గొడవ సద్దుమణిగింది.
![]() |
![]() |