తిరుమల తిరుపతి దేవస్థానంలోని వివిధ ట్రస్టులకు భక్తుల నుండి విరాళాలు అందుతున్నాయి. ఒడిశాకు చెందిన శివమ్ కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీలోని వివిధ ట్రస్టులకు మొత్తం రూ.80 లక్షల విరాళంగా అందించింది. అదే రాష్ట్రానికి చెందిన బలభద్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ. 20 లక్షలు విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు దాతలు డీడీలను TTD ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. అదే రాష్ట్రానికి చెందిన బాలభద్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు, ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చింది.ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగ నాయకులు మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి కదిరి ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో ఆ కంపెనీల ప్రతినిధి శ్రీ వై.రాఘవేంద్ర విశ్వకర్మ విరాళం డీడీలను అందజేశారు.
![]() |
![]() |