రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఈ క్రమంలోనే.. వాతావరణ శాఖ మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతంలో మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.. ఇది తీరానికి సమాంతరంగా కదులుతూ, బంగ్లాదేశ్ లేదా మయన్మార్ వైపు పయనిస్తుందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఎక్కువగా ఉండకపోవచ్చని, అల్పపీడనం ఏర్పడిన తర్వాత దీనిపై మరింత స్పష్టత వస్తుందని చెబుతున్నారు.. కాగా.. రాబోయే నాలుగు రోజుల్లో ఏపీలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.ఇవాళ అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద కాకుండా సురక్షిత ప్రాంతంలో ఆశ్రయం పొందాలని సూచించారు
![]() |
![]() |