ఏపీలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక కల్యాణం మంగళవారం చైత్ర శుద్ధ ఏకాదశి రోజున అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి సోమవారం రాత్రి అంకురార్పణతో కల్యాణ మహోత్సవాలు ప్రారంభం కానుండగా మంగళవారం మధ్యాహ్నం కొట్నాల ఉత్సవం, ఎదురు సన్నాహం పూర్తి కాగానే రాత్రి 8 గంటలకు ఆలయ రాజగోపురం ఎదురుగా సిద్ధం చేసిన అందమైన రథంపై సింహాద్రినాధుడు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ఆశీనులను చేస్తారు. అనంతరం జాలారి పెద్ద కదిరి లక్ష్మణరావు ఆధ్వర్యంలో సాంప్రదాయ బద్ధంగా రథోత్సవం ప్రారంభం కానుంది.
![]() |
![]() |