మేఘాలయ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ సయ్యద్ ఎండీ ఏ రాజి ఉజ్బెకిస్థాన్ లో మరణించారు. వ్యక్తిగత పర్యటనకు వెళ్లిన ఆయన ఈ నెల 4 నుంచి ఉజ్బెకిస్థాన్ రాజధాని బుకారా సిటీలో ఉంటున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఫోన్ చేయగా రాజి స్పందించలేదని మేఘాలయ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. దీంతో వెంటనే హోటల్ సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు వివరించారు. గది తలుపులు బద్దలు కొట్టి లోపలకు ప్రవేశించిన హోటల్ సిబ్బందికి బెడ్ పై రాజి నిర్జీవంగా పడి ఉండడం కనిపించిందని చెప్పారు.రాజి మరణంపై సీఎం సంగ్మా సంతాపం తెలిపారు. రాజి కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వపరంగా అన్ని రకాలుగా సాయం అందిస్తామని ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా ట్వీట్ చేశారు.
![]() |
![]() |