డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా వైసీపీ మాజీ మంత్రి రోజా సోషల్ మీడియా ద్వారా స్పందించారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రమాద వార్త తన మనసుని ఎంతో కలచివేసిందని, బాబు త్వరగా కోలుకుని ఆరోగ్యంగా తల్లిదండ్రులతో గడపాలని కోరుకుంటున్నట్లు ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.ప్రస్తుతం ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాల పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ ఈ సాయంత్రం సింగపూర్ వెళ్లనున్నారు.
![]() |
![]() |