ఏపీలో కూటమి నేతలు, పోలీసులు కలిసి చేస్తున్న నేరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని.. లింగమయ్య ఘటనే అందుకు ఉదాహరణ అని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘లింగమయ్య హత్యతో పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, శాంతి భద్రతలు దిగజారాయి. చంద్రబాబు ఎంత భయపెట్టినా, ప్రలోభాలు పెట్టిన ఎంపీపీ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ గెలిచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అడుగడుగునా దౌర్జన్యాలకు పాల్పడ్డారు’’ అని వైయస్ జగన్ ధ్వజమెత్తారు. పాపిరెడ్డిపల్లిలో టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని మంగళవారం.. వైయస్ జగన్ పరామర్శించారు.
![]() |
![]() |