ఏపీ జీఎస్డీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు గిమ్మిక్కులతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ జీఏస్డీపీలో రెండోస్థానంలో ఉందని సీఎంగా చంద్రబాబు గొప్పగా ప్రకటించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. ఇటువంటి పబ్లిసిటీ స్టంట్‌ను ఆయనకు వంతపాడే కొన్ని పత్రికలు వాస్తవమే అనేంతగా ప్రజల్ని నమ్మించేందుకు పతాక శీర్షికల్లో వార్తలు ప్రచురించి బాకా ఊదడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన ప్రజలకు వాస్తవాలను తెలియకుండా, తన పాలనలో అద్భుతమైన అభివృద్ది సాధ్యపడిందని పచ్చి అబద్దాలను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
![]() |
![]() |