ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంతిల్లు రాజధాని అమరావతిలో నిర్మించుకోనున్నారు.ఈ9 రహదారి పక్కన కొంత భూమిని కొనుగోలు చేసిన చంద్రబాబు, బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి గృహ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. 2014లో రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత, చంద్రబాబు నాయుడు పాలనను ఇక్కడి నుంచే కొనసాగించారు.2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, అమరావతిని దేశంలోనే అగ్రగామి రాజధానిగా తీర్చిదిద్దేందుకు కృతనిశ్చయంతో ఉన్నారు.రాజధాని ఎంపిక నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యానికి చంద్రబాబు ప్రాధాన్యతనిచ్చారు.ఇప్పుడు చంద్రబాబు స్వయంగా ఇల్లు నిర్మించుకుంటుండడంతో తమకు మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నారు.రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు నివాసం ఏర్పాటు చేసుకోవడం పట్ల ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.
![]() |
![]() |