ఇటీవల హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ రాప్తాడు రావడంపై టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్రస్థాయిలో స్పందించారు. పరామర్శలకు ఎలా వెళ్లాలో కూడా జగన్ కు తెలియదా? అని ప్రశ్నించారు. జై జగన్ అనిపించుకుంటూ పరామర్శకు వెళతారా? అని నిలదీశారు. ఇవాళ జగన్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలని అన్నారు. అబద్ధాలను పేపర్ పై రాసుకొచ్చి చదివారని విమర్శించారు. లింగమయ్య మరణాన్ని ఫ్యాక్షన్ మర్డర్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. పులివెందులలో బాత్రూమ్ లో చంపుతారేమో కానీ, అనంతపురం జిల్లాలో అలాంటి హత్యలు జరగవని పరిటాల సునీత వ్యాఖ్యానించారు. "పోలీసులపై ఇష్టంవచ్చినట్టు మాట్లాడడమేంటి? పోలీస్ వ్యవస్థను అవమానించేలా జగన్ మాట్లాడారు. చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి జగన్ కు లేదు. జగన్ మాటలు పరిటాల కుటుంబాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయి. వాస్తవాలు తెలుసుకుని జగన్ మాట్లాడాలి" అని హితవు పలికారు.
![]() |
![]() |