సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఇవనోవిచ్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనయుడు మార్క్ శంకర్ ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఇదిలావుంటే పవన్ కళ్యాణ్ సింగపూర్ బయల్దేరనున్నారు. విశాఖ జిల్లా పర్యటనను రద్దు చేసుకున్న పవన్ కళ్యాణ్.. హైదరాబాద్ చేరుకున్నారు. మార్క్ శంకర్‌కు జరిగిన ప్రమాదంపై విలేకర్లకు వివరాలు వెల్లడించారు. అరకు పర్యటనలో ఉన్న సమయంలో ఫోన్ వచ్చిందన్న పవన్ కళ్యాణ్.. అప్పుడు ప్రమాద తీవ్రత తెలియలేదన్నారు.మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయని తెలిపారు. 30 మంది పిల్లలు సమ్మర్ క్యాంపులో ఉన్నప్పుడు ప్రమాదం జరిగిందన్న పవన్ కళ్యాణ్.. ఓ పసిబిడ్డ చనిపోయిందని తలిపారు. పెద్ద కుమారుడు అకీరా నందన్ పుట్టిన రోజునే.. చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు ప్రమాదం జరగడం బాధాకరమంటూ పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు.
![]() |
![]() |