టీడీపీ తోడేళ్ళు, జనసేన గుంటనక్కలు సోషల్ మీడియాలో మహిళలపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నాయని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల మండిపడ్డారు. ఈ నక్కలు, తోడేళ్లను పెంచి పోషిస్తోంది టీడీపీనే అంటూ ఫైర్ అయ్యారు. టీడీపీ అంటేనే తెలుగు డ్రామా పార్టీ అని ఎద్దేవా చేశారు. వైయస్ జగన్, ఆయన సతీమణి భారతిపై ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను శ్యామల తీవ్రంగా ఖండించారు. ఆమె తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.... ఐ-టీడీపీకి చెందిన చేబ్రోలు కిరణ్ ఇటీవల వైయస్ జగన్ కుటుంబంపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్‌పై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దీనితో కంగారుపడ్డ కూటమి ప్రభుత్వం అతడిని అరెస్ట్ చేశామని, చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని గొప్పగా ప్రకటించింది. ఇదే కిరణ్ గతంలో ఇటువంటి అభ్యంతర పోస్ట్‌లు ఎన్నో పెట్టారు. అలాగే చాలా మంది తెలుగుదేశంకు చెందిన సోషల్ మీడియా తోడేళ్ళు, జనసేన గుంటనక్కలు నిత్యం వైయస్ఆర్‌సీపీ వారిపై విషం చిమ్ముతూనే ఉన్నారు. వారిపై ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా పోలీసులు మాత్రం వారిని కాపాడుతూ వచ్చారు. ఈ ప్రభుత్వ అండతోనే ఈ రోజు సోషల్ మీడియాలో సైకోలు పెరిగిపోయారు. ఇప్పుడు కిరణ్‌ను అరెస్ట్ చేయడం ద్వారా తాము నిస్పక్షపాతంగా పనిచేస్తున్నామని కూటమి ప్రభుత్వం చెప్పుకునేందుకు నాటకం ఆడుతోంది అని అన్నారు.
![]() |
![]() |