మైనింగ్ అక్రమాల కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని ఆదేశించారు. అయితే, మూడుసార్లు నోటీసులు పంపినప్పటికీ కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించలేదు. మొదటిసారి నోటీసులు అందుకున్న సమయంలో మీడియా ముందుకు వచ్చిన కాకాణి.. తాను నియోజకవర్గంలోనే ఉంటానని, ఎక్కడికీ పారిపోనని చెప్పారు. ప్రస్తుతం ఆయన జాడ తెలియక పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు.‘ఎక్కడికీ పారిపోనని చెప్పావ్ మరి ఇప్పుడు ఎక్కడా కనిపించడంలేదేం? పులిని అన్నావ్, తొడ కొట్టావ్.. ఇప్పుడు ఎక్కడికి పోయావు? పోలీసుల విచారణకు ఎందుకు హాజరుకావడంలేదు?’ అని ప్రశ్నించారు. పోలీసులు విచారణకు పిలిస్తే కాకాణి తప్పించుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. విచారణకు హాజరుకావచ్చు కదా అని సలహా ఇచ్చారు. ‘ఒకవేళ నువ్వు జైలుకు వెళ్తే అక్కడ నీ స్నేహితుడు వల్లభనేని వంశీ ఉంటాడు, పలకరించు’ అని ఎమ్మెల్యే సోమిరెడ్డి వ్యంగ్యంగా అన్నారు.
![]() |
![]() |