సూట్‌కేసులో తన గర్ల్‌ఫ్రెండ్‌ను దాచిపెట్టి.. హాస్టల్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నించిన విద్యార్ధి సెక్యూరిటీ గార్డులకు దొరికిపోయాడు. అతడు తీసకొస్తున్న సూట్‌కేసు అనుమానాస్పదంగా ఉండటంతో సెక్యూరిటీ అపి.. తనిఖీ చేశారు. దీంతో అతడి ప్లాన్ ఫెయిల్ అయ్యింది. జిందాల్ యూనివర్సిటీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. భద్రతా సిబ్బంది సూట్‌కేసును తెరుస్తుండగా.. అందులో ఒక అమ్మాయి ఇరక్కుని ఉండటం వీడియోలో కనిపిస్తోంది. తోటి విద్యార్థులు ఈ దృశ్యాన్ని కెమెరాలో రికార్డ్ చేసి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. సూట్‌కేసులో అమ్మాయి ఉందన్న విషయం హాస్టల్ సిబ్బందికి లేదా విశ్వవిద్యాలయ అధికార యంత్రాంగానికి ఎలా తెలిసిందనేది తెలియరాలేదు. ఆ అమ్మాయి అదే విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థిని లేదా బయటి వ్యక్తి అనేది స్పష్టంగా తెలియదు. అయితే, ఆ విద్యార్ధికి ఆమె స్నేహితురాలని సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొన్నారు.
కొన్ని నివేదికల ప్రకారం.. సూట్‌కేసును విద్యార్ది తీసుకొస్తుండగా.. ఇనుప రాడ్డును ఢీకొనడంతో లోపలి ఉన్న అమ్మాయి అరిచింది. ఆమె కేక వినడంతో సెక్యూరిటీ గార్డులకు పట్టుబడింది. ఈ ఘటనపై జిందాల్ యూనివర్సిటీ యంతాంగ్రం కా అధికారిక ప్రకటన లేదు. ఈ వీడియో హాస్టల్‌లో భద్రతపై సందేహాలను లేవనెత్తుతోంది. ఆ విద్యార్థి లేదా అమ్మాయిపై ఎలాంటి చర్య తీసుకున్నారో వెల్లడించలేదు. మరోవైపు, ఈ వీడియోపై సోషల్ మీడియాలో మీమ్స్, జోకులు తెగ పేలుతున్నాయి.
‘సూట్‌కేసులోని ఆ అమ్మాయి.. అది తెరుస్తున్నప్పుడు ఫోటో కోసం పోజులిచ్చిన పసుపు చొక్కా ఆ అబ్బాయిను హాల్ ఆఫ్ ఫేమ్‌లో పెట్టాలి’ అని ఒకరు.. ‘ఈ రోజుల్లో సూట్‌కేసులు అనేక పనులకు వాడేస్తున్నారు.. ఏది ఏమైనప్పటికీ నేను కూడా ఇలా ప్రయత్నిద్దామంటే నా వయస్సు దాటిపోయింది’ అని మరొకరు చమత్కారంగా ట్వీట్ చేశాడు. అయితే, ‘మా హాస్టల్‌లో కూడా ఒకసారి ఇలా జరిగింది’ ఓ డాక్టర్ దీనిపై కామెంట్ పెట్టాడు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
![]() |
![]() |