మధ్యప్రదేశ్‌లోని ఉమారియా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. 12 ఏళ్ల బాలుడిని పులి చంపేసింది. ఇప్పపూలను సేకరించేందుకు విజయ్ కోల్ అనే బాలుడు తాతతో కలిసి అడవికి వెళ్లాడు.
ఈ క్రమంలో పులి బాలుడిపై ఒక్కసారిగా దాడి చేసి అతని చంపేసింది. గ్రామస్థులు కేకలు వేయడంతో బాలుడి మృతదేహాన్ని చెట్ల పొదల్లో వదిలి వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది విచారణ జరుపుతున్నారు.
![]() |
![]() |