ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో గాలిదుమారం.. ఆగిపోయిన విమానాలు

national |  Suryaa Desk  | Published : Sat, Apr 12, 2025, 08:26 PM

దేశ రాజధాని ఢిల్లీపై శుక్రవారం సాయంత్రం బలమైన దుమ్ము, ఈదురు గాలులు విరుచుకుపడ్డాయి. గత పది రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న ఢిల్లీ వాసులకు ఈ వర్షం వల్ల కొంత ఉపశమనం లభించినా.. జనజీవనం అస్తవ్యస్తమైంది ఢిల్లీలో వర్షానికి చెట్లు కూలి రోడ్డలపై పడటంతో ఎక్కడిక్కడ వాహనాలు నిలిచిపోయాయి. గాలి దుమారంతో పలు విమానాల రాకపోకల్లో జాప్యం ఏర్పడింది.. వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా కనీసం 15 విమానాలను దారి మళ్లించినట్టు సమాచారం. గ. ఎయిరిండియా, ఇండిగో వంటి విమానయాన సంస్థలు X (ట్విట్టర్) ద్వారా సూచనలు జారీ చేసినప్పటికీ, చాలా మంది ప్రయాణికులు తమ కష్టాలను సోషల్ మీడియాలో వెళ్లగక్కుతున్నారు.


‘‘మాకు శ్రీనగర్ నుంచి ఢిల్లీ... అక్కడి నుంచి ముంబయికి సాయంత్రం 4 గంటలకు కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది... మా విమానం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ కావాల్సి ఉండగా, గాలి దుమారం కారణంగా చండీగఢ్‌కు మళ్లించారు.. ఆ తర్వాత రాత్రి 11 గంటలకు తిరిగి ఢిల్లీకి తీసుకొచ్చారు.. ఆ తర్వాత ఢిల్లీలో ముంబయికి వెళ్లే మరో విమానం ఎక్కించారు.. మేము దాదాపు 4 గంటల పాటు అందులో విమానంలో కూర్చున్నాం.. ఆ తర్వాత మళ్లీ దింపి, మళ్లీ సెక్యూరిటీ చెక్ చేయించారు. ఇప్పుడు ఉదయం 8 గంటలు అవుతోంది.. మేము ఇంకా విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నాం.. మా విమానం ఇంకా బయలుదేరలేదు’ ఎయిరిండియా ప్రయాణికుడు ఒకరు వాపోయారు.


అదే విమానంలోని 75 ఏళ్ల మహిళ మాట్లాడుతూ.. ‘‘మేము 12 గంటలకు పైగా చిక్కుకుపోయాం... దుమ్ము కారణంగా విమానం దారి మళ్లించారు.. రాత్రి 11 గంటల నుంచి ఢిల్లీ విమానాశ్రయంలో పడిగాపులు కాస్తున్నాం’’ అని ఆమె అన్నారు. కొంతమంది ప్రయాణికులు సోషల్ మీడియా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విమానాశ్రయంలో పరిస్థితిని తెలియజేసే ఫోటోను పోస్ట్ చేస్తూ. ‘అత్యంత అస్తవ్యస్తమైన, తప్పుదోవ పట్టించే ప్రపంచ స్థాయి అంతర్జాతీయ విమానాశ్రయం. న్యూఢిల్లీ... బస్ స్టాండ్ కంటే అధ్వాన్నంగా ఉంది’ అని మండిపడ్డాడు.


‘కోల్‌కతా నుంచి ఢిల్లీకి వెళ్లే ఇండిగో విమానం శుక్రవారం సాయంత్రం నుంచి 6 సార్లు రీషెడ్యూల్ చేశారు. మీరు ప్రయాణికులను తేలికగా తీసుకుంటున్నారా?? ప్రయాణికులు ఇప్పటికే 6 గంటలు ఆలస్యంగా ఉన్నారు’ అని ఇండిగోను ట్యాగ్ చేస్తూ మరొకరు పోస్ట్ పెట్టారు..‘ఢిల్లీ నుంచి విమానం ఇంకా బయలుదేరలేదు. మీరు సమయానికి ఎక్కించి రెండు గంటలు కూర్చోబెట్టారు.. నిబంధన ప్రకారం విమానం రెండు గంటలకు పైగా ఆలస్యం అయితే మీరు వారికి రిఫ్రెష్‌మెంట్‌లు అందించాలి’ అని మరొకరు ట్వీట్ చేశారు.


‘14 గంటలకు పైగా ఢిల్లీ విమానాశ్రయంలో చిక్కుకుపోయాను...మీకు మీ ప్రయాణికుల పట్ల బాధ్యత, నిబద్ధత లేదు... మీరు ఈ స్థానంలో ఉండటానికి అర్హులు కాదు’ ఎయిరిండియాను మరో ప్రయాణికుడు ట్యాగ్ చేశాడు. అయితే, ఎయిరిండియా మాత్రం ఢిల్లీ నుంచి, ఢిల్లీకి వచ్చే విమానాలు వర్షం కారణంగా ఆలస్యం అయ్యాయని లేదా దారి మళ్లించినట్టు పేర్కొంది. ‘విమానాశ్రయ బృందం తక్షణ పరిష్కారాన్ని నిర్ధారించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తోంది.. అంతరాయానికి చింతిస్తున్నాం.. ప్రయాణికులు సంయమనం పాటించాలని అభ్యర్థిస్తున్నాం" అని పేర్కొంది. ఇండిగో, స్పైస్ జెట్ సైతం ఇలాంటి ప్రకటనే చేశాయి.. ఢిల్లీ విమానాశ్రయం కూడా ప్రయాణికులకు విమానాల ఆలస్యం గురించి తెలియజేస్తూ ఒక సూచనను జారీ చేసింది.


ఢిల్లీలో 52.3 డిగ్రీల ఎండ.. దేశ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత


‘ఢిల్లీలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా, విమానాశ్రయంలోని కొన్ని విమానాలు ప్రభావితమయ్యాయి. అప్‌డేట్ కోసం సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని ప్రయాణికులకు సూచించా... ఈ అసౌకర్యానికి మేం చింతిస్తున్నాం’ అని తెలిపింది.


ఢిల్లీలో దుమ్ము తుఫాను


గత రెండు రోజుల నుంచి ఢిల్లీలో ఈదురు గాలులు, పిడిగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలను బలమైన దుమ్ము తుఫాను కమ్మేసింది. ఇది రాజధానిలోని కొన్ని ప్రాంతాలలో భారీ నష్టాన్ని మిగిల్చింది. చెట్ల కొమ్మలు విరిగి రోడ్లు, వాహనాలపై పడ్డాయి. అటు, భారత వాతావరణ శాఖ సైతం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఢిల్లీలో 'ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com