కడప నగరం మధ్యగా సాగుతున్న బుగ్గవంక వాగు, దాని పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి చేసే పనులను ఎమ్మెల్యే మాధవి ప్రారంభించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ నిమిత్తం ఈరోజు బుగ్గ వంక వాగు జంగిల్ క్లియరెన్స్ ప్రారంభించామని మాధవి తెలిపారు. త్వరలోనే ఈ పనులను పూర్తి చేసి, బుగ్గ వంక వాగుని ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంగా తీర్చిదిద్దేలా చేస్తామని, కడప నగరాన్ని వరద బారి నుంచి రక్షించడమే కాకుండా, పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు దోమలు, పందుల బెడద లేకుండా చూస్తామని తెలియజేశారు.
![]() |
![]() |