అయోధ్య రామ మందిర ట్రస్టుకు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ విషయంపై పోలీసులు, నిఘా విభాగం పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేశారు. కాగా, తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఈ మెయిల్ పంపినట్లు సమాచారం.ఈ విషయాన్ని అయోధ్య జిల్లా పోలీసు అదికారి ఇవాళ తెలిపారు. అయితే మీడియాతో వాళ్లు ఎక్కువ సమచారాన్ని బహిర్గతం చేయలేదు. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఇంగ్లీష్ భాషలో బెదిరింపు మెయిల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆదివారం రాత్రి ఆ మెయిల్ వచ్చినట్లు వెల్లడించారు.అయితే ఇప్పటి వరకు రామాలయ ట్రస్టు నుంచి కానీ భద్రతా ఏజెన్సీల నుంచి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. మరో వైపు ఆలయ ట్రస్టు కీలక ప్రకటన చేసింది. ఆలయంలో పెండింగ్‌లో ఉన్న పనులన్నీ మే 15వ తేదీ వరకు పూర్తి కానున్నట్లు ఆలయ అధికారి తెలిపారు.
![]() |
![]() |