ఆఫ్రికా దేశం సుడాన్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల పారామిలటరీ ఆర్ఎస్ఎఫ్ జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య 300 దాటినట్లు యూఎన్ హ్యుమానిటీ ఏజెన్సీ వెల్లడించింది. వీరిలో 10 మంది ఐరాస సిబ్బంది కూడా ఉన్నట్లు పేర్కొంది. మృతుల్లో 23 మంది చిన్నారులు ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ఆ దేశంలో దాదాపు రెండేళ్లుగా పౌర యుద్ధం కొనసాగుతోంది.ఈ దాడులకు సంబంధించి బలగాలు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దాడుల సందర్భంగా భయంతో పౌరులు పరుగులు తీశారు. బతుకు జీవుడా అంటూ ప్రాణలు అరచేతిలో పట్టుకున్నారు. మరోవైపు.. దాడుల్లో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులు.. కన్నీటిపర్యంతమవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. అయితే, 2023 ఏప్రిల్‌లో సూడాన్ ఆర్మీ చీఫ్ అబ్దుల్ ఫత్తా అల్-బుర్హాన్ మాజీ డిప్యూటీ, ఆర్‌ఎస్‌ఎఫ్ కమాండర్ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లోల మధ్య ఘర్షణ నెలకొనడంతో ఇరువర్గాల మధ్య దాడులు ప్రారంభమయ్యాయి. సూడానీస్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ (SAF), ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య జరిగిన దాడుల వల్ల 2023 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 29,600 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
![]() |
![]() |