ఏపీలోని నందిగామకు చెందిన వర్షిణీ బీటెక్ చదువుకుంది. అఘోరీ వర్షిణీ ఇంట్లో కొన్నాళ్లు మకాం వేసింది. అక్కడ పూజలు కూడా చేసింది. అక్కడి నుంచి వెళ్తూ వర్షిణీని తన వెంట తీసుకెళ్లింది. అఘోరీ తమ కుమార్తెను ఎత్తుకెళ్లిపోయాడని వర్షిణీ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వర్షిణీని తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చారు. కొన్నాళ్లకు వర్షిణీ ఇంట్లో నుంచి పారిపోయింది. ఇప్పుడు వారు పెళ్లి చేసుకున్నారు.తాజాగా ఆ వర్షిణిని పెళ్లాడింది. మధ్యప్రదేశ్ లోని ఓ మారుమూల ప్రాంతంలోని ఆలయంలో ఈ వివాహం జరిగినట్లు సమాచారం. వర్షిణి మెడలో అఘోరి తాళి కడుతున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వర్షిణి, అఘోరి ఇద్దరూ దండలు మార్చుకోవడం, తలంబ్రాలు పోసుకోవడంతో పాటు ఏడడుగులు నడిచిన దృశ్యాలు ఆ వీడియోలో దర్శనమిచ్చాయి.
![]() |
![]() |