ఐసీయూలో చికిత్స పొందుతున్న ఎయిర్ హోస్టెస్‌పై అత్యాచారం. ఢిల్లీలో ఓ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఎయిర్ హోస్టెస్(46)పై అత్యాచారానికి పాల్పడిన ఆసుపత్రి సిబ్బంది. గురుగ్రామ్ లోని ఓ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో జారిపడ్డ ఆమె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఘటన. డిశ్చార్జ్ అయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎయిర్ హోస్టెస్.. నిందితుల కోసం గాలింపుబాధితురాలి (46) ఫిర్యాదు మేరకు గురుగ్రామ్ సదర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ప్రస్తుతం పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నారు. ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం... సంస్థ తరఫున శిక్షణ కోసం బాధితురాలు గురుగ్రామ్‌కు వచ్చారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తూ నీళ్లలో మునిగి గాయపడటంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. తర్వాత, ఏప్రిల్ 5న మరో ప్రైవేట్ ఆసుపత్రికి ఆమెను తరలించి చికిత్స అందించారు. ఏప్రిల్ 6న వెంటిలేటర్‌పై ఉన్న సమయంలో కొంత మంది ఆసుపత్రి సిబ్బంది లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు.
![]() |
![]() |